Veerasimhareddy అనంతరపురంలో బాలయ్య షూటింగ్

Tuesday,November 08,2022 - 01:28 by Z_CLU

NBK’s ‘VeerasimhaReddy’ shoot to happen in Ananthapur dist

నందమూరి బాలకృష్ణ (NBK) హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘వీర సింహా రెడ్డి’ (Veerasimhareddy) వచ్చే సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ అనంతరపురంలో జగనుంది.

రేపటి నుండి బాలయ్య పై అక్కడ పలు లోకేషన్స్ లో  కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ముందుగా పెన్నోబిలం లక్ష్మి నరసింహా స్వామీ ఆలయంలో షూటింగ్ చేయనున్నారు. అనంతరం అమిద్యాల, రాకెట్ల ,  ఉరవకొండ లో షూట్ కొనసాగనుంది. నవంబర్ 12, 13 న పెనుగొండ ఫోర్ట్ లో షూట్ జరగనుంది. వారం రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ లో కీలక సన్నివేశాలు , ఫైట్స్ షూట్ చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా విజయ్ దునియా విలన్ గా నటిస్తున్నాడు. తమన్ (Thaman S) మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా  ఆల్బం నుండి త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics