NBK 107 రిలీజ్ డేట్ పై సస్పెన్స్ !

Friday,October 14,2022 - 02:46 by Z_CLU

 NBK107 Release date , makers holds suspense !

అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నుండి రాబోతున్న మరో మాస్ యాక్షన్ మూవీ NBK107. షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ లో రెండు సందేహాలున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు ? అవును సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు మేకర్స్. NBK107 పేరుతోనే ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ చేశారు. మరో సందేహం సినిమా రిలీజ్ ఎప్పుడు ? ఇప్పటి వరకూ అఫీషియల్ రిలీజ్ డేట్ చెప్పలేదు మేకర్స్. దీంతో ఈ రెండు విషయాలు ఎప్పుడు చెప్తారా ? అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు విషయాలకు సంబంధించి త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట. సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుందనే టాక్ వినబడుతుంది. మరి వైపు మేకర్స్ డిసెంబర్ లో ఓ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే సినిమాకు రెడ్డి గారు , జై బాలయ్య అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఓ టైటిల్ ఫైనల్ చేస్తారా ? లేదా మరో కొత్త టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా ? తెలియాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ లో దీపావళి స్పెషల్ గా మేకర్స్ టైటిల్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పే అవకాశం ఉంది. మరి బాలయ్య అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్ లోనే వస్తారా ? లేదా తనకి కలిసొచ్చిన సంక్రాంతి బరిలో నిలుస్తారా ? చూడాలి.