#NBK107 షూటింగ్ డీటెయిల్స్

Wednesday,August 31,2022 - 10:00 by Z_CLU

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌  #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం  యూనిట్ టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్ళింది. అక్కడ సినిమాలోని ప్రముఖ తారాగణంతో కీలక భాగాన్ని చిత్రీకరించనున్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ లొకేషన్ నుండి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్సయిట్ మెంట్ ఈ ముగ్గురిలో కనిపిస్తోంది. టాకీ పార్ట్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

మేకర్స్ ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున రెండు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్‌లను అందించారు. ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రెండింటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఈ చిత్రంలో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.