NBK102 మూవీ డీటెయిల్స్

Wednesday,May 10,2017 - 04:40 by Z_CLU

లేటెస్ట్ గా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ గా ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ ప్రెజెంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసేశాడు బాలయ్య… కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్ పై సి.కళ్యాణ్‌ నిర్మాణంలో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ..


భారీ బడ్జెట్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకు ఎం.రత్నం కథ, మాటలు అందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్‌ నెలాఖరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు…