మరో హిట్ కొట్టిన లేడీ సూపర్ స్టార్

Monday,August 20,2018 - 01:01 by Z_CLU

నయనతారకు ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చేసింది. హీరోతో సంబంధం లేకుండా ఆమె నటించే సినిమాలు తమిళనాట హిట్ అవుతుంటాయి. రీసెంట్ గా విడుదలైన కొలమావు కోకిల అనే సినిమా కూడా సక్సెస్ అయింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాతో నయన్ స్టామినా ఏంటో కోలీవుడ్ కు మరోసారి తెలిసొచ్చింది.

ప్రస్తుతం కొలమావు కోకిల సినిమా కోలీవుడ్ జనాలతో పాటు సెలబ్రిటీల్ని ఎట్రాక్ట్ చేస్తోంది. అమాయకంగా కనిపిస్తూ డ్రగ్స్ సరఫరా చేసే కోకిల క్యారెక్టర్ లో నయనతార జీవించేసింది. ఆమె నటనను రజనీకాంత్, శంకర్ లాంటి ప్రముఖులు సైతం మెచ్చుకుంటున్నారు. మరో వైపు ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు ఒక్క చెన్నై నగరం నుంచే ఏకంగా కోటిన్నర షేర్ వచ్చింది. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి చెన్నైలో 3 రోజుల్లో ఇంత కలెక్షన్ రావడం గొప్ప విషయం.

కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా తెలుగులోకి రానుంది. కోకో కోకిల పేరిట ఈనెల 24న ఏపీ, నైజాంలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకాబోతోంది.