'వసంతకాలం'ను తీసుకొస్తున్న లేడీ సూపర్ స్టార్

Monday,October 07,2019 - 01:43 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను ‘వసంతకాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు.

ఇంతకుముందు ఈ బ్యానర్ పై ‘ఏకవీర, వెంటాడు-వేటాడు’ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు నయనతార సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘వసంతకాలం’ ప్రస్తుతం సెన్సార్ జరుపుకొంటోంది. నవంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా చెబుతున్నారు మేకర్స్. కొలైతుర్ కాలమ్ అనే సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ ఏడాది ఆగస్ట్ లో తమిళనాట విడుదలైంది ఈ సినిమా.