రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నయనతార 'కోకో కోకిల'

Tuesday,August 21,2018 - 05:25 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న నయనతార తమిళ్ లో ఇటివలే ఓ గ్రాండ్ హిట్ అందుకుంది.. రీసెంట్ గా అక్కడ విడుదలైన ‘కొలమావు కోకిల’ నయన్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చేలా చేసింది. కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా ‘కోకో కోకిల’ టైటిల్ తో ఈనెల 31న ఏపీ, నైజాంలో గ్రాండ్ గా విడుదలకాబోతోంది.

ప్రస్తుతం ‘కొలమావు కోకిల’ సినిమా కోలీవుడ్ జనాలతో పాటు సెలబ్రిటీలను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. కోకిల క్యారెక్టర్ లో నయనతార జీవించేసిందంటూ నయన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కోలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో ఆమె నటనను రజనీకాంత్, శంకర్ లాంటి ప్రముఖులు సైతం మెచ్చుకుంన్నారు. మరో వైపు ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు ఒక్క చెన్నై నగరం నుంచే ఏకంగా కోటిన్నర షేర్ వచ్చింది. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి చెన్నైలో 3 రోజుల్లో ఇంత కలెక్షన్ రావడం గొప్ప విషయం.

ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ హంగామా చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో.. నయన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో..చూడాలి.