Nayanthara నయన్, విగ్నేష్ ల పెళ్లి వేడుక అక్కడే

Tuesday,June 07,2022 - 02:17 by Z_CLU

Nayanthara, Vignesh Shivan’s Wedding details

కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న నయనతార , విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న మహాబలేశ్వరంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. అయితే ముందుగా వీరిద్దరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ప్రయాణరిత్యా ఇబ్బందుల వలన ఫైనల్ గా మహేబలేశ్వరం ఎంచుకున్నారు. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ పెళ్లి వేడుకకు తమిళ ఇండస్ట్రీ నుండి అతికొద్ది మంది ప్రముఖులు , నయన్ , విగ్నేష్ బంధువులు , మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు. జూన్ 12న చెన్నైలో రిసెప్షన్ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ సినీ ప్రముఖులంతా హాజరు కానున్నారు. ఇక నయన్ , విగ్నేష్ ల పెళ్లి వేడుకను ఓ స్పెషల్ వీడియోగా షూట్ చేయబోతున్నారు. తర్వాత ఈ పెళ్లి వీడియో ఓ ప్రముఖ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ మేరకు డీలింగ్ క్లోజ్ అయింది. నయన్ పెళ్లి వీడియోకి సంబంధించి దర్శకుడు గౌతం మీనన్ కి భాద్యతలు అప్పగించారు.

ఇక జూన్ 9న మధ్యాహ్నం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. పెళ్లి వీడియో చూడాలంటే మాత్రం ఇంకా టైం పడుతుంది. ఇక నయన్ , విగ్నేష్ ఇంట్లో ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. వీరిద్దరి పెళ్లితో కోలీవుడ్ లో సందడి నెలకొంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics