21న వస్తున్న 'వసంతకాలం'

Sunday,February 16,2020 - 01:12 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు.

‘5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు” వంటి చిత్రాలు అందించాడు నిర్మాత దామెర శ్రీనివాస్. ఇప్పుడు వసంతకాలం సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఈనెల 21న వసంతకాలం సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు.