అన్నీ కలిసొస్తున్నాయి కాబట్టే నయనతార!!

Saturday,March 02,2019 - 10:02 by Z_CLU

నయనతార తో సినిమా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మినిమం సక్సెస్ గ్యారంటీ. మరీ కోటానుకోట్ల బడ్జెట్ అవసరం కాస్త స్ట్రాంగ్ స్క్రిప్ట్ రాసుకోవాలి కానీ, డైరెక్టర్ కొత్తవాడైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది నయనతార. అలాగని బడా స్టార్ సినిమాలకు దూరమవుతుందా అంటే అస్సలు లేదు. ఇటు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే, మరో వైపు గ్లామరస్ డాల్ లా మెస్మరైజ్ చేస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ ‘సైరా’ లో నటిస్తుంది నయనతార. రీసెంట్ గా నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన కొత్త సినిమా ‘అంజలి CBI’ లో అగ్రెసివ్ క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపిస్తుంది నయన్. మాసివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మాస్ ఆడియెన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాకి ఈ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుందంటే, దానిపై కంపల్సరీగా నయనతార గత సినిమాల సక్సెస్ ప్రభావం కూడా ఉంది.

 

 

‘అంజలి CBI’ ప్రస్తావన వచ్చినప్పుడు ‘విశ్వాసం’ సినిమా గురించి కూడా మెన్షన్ చేయాలి. ఈ 2 సినిమాల్లో నయనతార క్యారెక్టర్స్ లో వేరియేషన్స్ గమనిస్తే నయనతార ఎంత ప్లాన్డ్ గా కరియర్ డిజైన్ చేసుకుంటుందో అర్థమవుతుంది. అజిత్ సరసన అంతే గ్లామరస్ గా మెస్మరైజ్ చేసిందీ భామ.

డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమా కోకోకోకిల. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా, తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని తపన పడే కూతురిగా, ఆపై ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్న సమస్యల్లోంచి బయటపడే అమ్మాయిగా నయనతారలోని మరో యాంగిల్ ని ప్రెజెంట్ చేసిందీ సినిమా.

బాలకృష్ణ సరసన ‘జై సింహా’ లోను నటించింది నయనతార. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన కాస్త రాయల్ లుక్ లో కనిపించాలంటే నయనతార కావాల్సిందే. అయితే ఈ సినిమాకి జస్ట్ బిఫోర్ వరసగా 2 ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. డోర, కర్తవ్యం. రెండింటిలోను నయనతార ప్లే చేసిన క్యారెక్టర్స్ కంప్లీట్ గా డిఫెరెంట్. ‘డోర’ లో టాక్సీ ఓనర్ అయితే, ‘కర్తవ్యమ్’ లో కలెక్టర్. రెండు సినిమాలు దేనికవే స్పెషల్.

 

అంతెందుకు సందర్భం వచ్చింది కాబట్టి నయనతార సినిమాల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది కానీ, నిజానికి ఫిల్మ్ మేకర్స్ నయనతార తో సినిమా చేస్తే మినిమం వసూళ్లు గ్యారంటీ అనే కాన్ఫిడెంట్ తో, ప్రత్యేకంగా  ఈ లేడీ సూపర్ స్టార్ తో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకదా అలా అన్నీ కలిసొస్తున్నాయి కాబట్టే నయనతార.