ఆదిపరాశక్తిగా మారిన నయనతార

Friday,June 05,2020 - 06:43 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదిపరాశక్తిగా మారింది. ఆర్జే బాలాజీ డైరక్ట్ చేస్తున్న ముఖ్తి అమ్మాన్ సినిమాలో నయనతార ఇలా దేవత పాత్రలో కనిపించనుంది. కెరీర్ లో ఇలా ఓ దేవత పాత్రలో నయనతార కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారీ జ్యూవెలరీ ధరించిన నయనతార, ఓ చేతిలో త్రిశూలం పట్టుకొని అచ్చమైన దేవతగా మెరిసిపోతోంది. అమ్మవారిగా నయనతార పెర్ ఫెక్ట్ గా సూట్ అయిందంటూ ఆమె ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.

ఇది పూర్తిగా ఆధ్యాత్మిక చిత్రమే అంటున్నాడు దర్శకుడు కమ్ నటుడు ఆర్జే బాలాజీ. ఓ సగటు డివోషనల్ మూవీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయని చెబుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది.