CBI ఆఫీసర్ గా నయనతార

Tuesday,February 05,2019 - 05:31 by Z_CLU

నయనతార కొత్త సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఇమైక్క నోడిగ‌ల్’ తెలుగులో ‘అంజలి CBI’ గా రిలీజవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఫిల్మ్ మేకర్స్, సినిమాని ఫిబ్రవరి 22 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్ హైలెట్ అయ్యే ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. దానికి తోడు నయనతార జస్ట్ CBI ఆఫీసర్ గానే కాకుండా మరో సర్ ప్రైజింగ్ షేడ్ లో కనిపించనుంది. నయనతార పాటు మరో ఇంపార్టెంట్ లో నటించిన రాశిఖన్నా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడంతో, సినిమాపై ఇంట్రెస్టింగ్ వై బ్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో తనకంటూ పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నయనతార, CBI ఆఫీసర్ గా మరింత మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్. R. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి C.H. రాంబాబు, ఆచంట గోపీనాథ్ నిర్మాతలు. హిప్ హాప్ తమిళ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.