Lucifer - 2 కీలక పాత్రలు ఫిక్స్?

Saturday,January 02,2021 - 01:59 by Z_CLU

ఆచార్య సినిమా కంప్లీట్ అయిన వెంటనే సెట్స్ పైకి రాబోతోంది లూసిఫర్ రీమేక్. Chiranjeevi హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు నటీనటుల సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. లూసిఫర్ లో నయనతారను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ సినిమాలో ముఖ్యమంత్రి కుమార్తె రోల్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ రోల్ కోసం Nayantharaను తీసుకోవాలని అనుకుంటున్నారట.

nayanthara-satyadev-in-lucifer-telugu-remake

ఇక మరో కీలక పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అది ఏ క్యారెక్టర్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తను చిరంజీవి సినిమాలో నటిస్తే చాలని, ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని SatyaDev కోరినట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి, 3 నెలల్లో సినిమాను పూర్తిచేయాలనేది ప్రస్తుతానికి అనుకుంటున్న ప్లాన్. ఇదే కనుక జరిగితే కొత్త ఏడాదిలో మెగాస్టార్ నుంచి 2 సినిమాలు రావడం గ్యారెంటీ.

Also Check – ఇద్దరు మిత్రుల కలయిక