మార్చి 3న నయనతార సినిమా రిలీజ్

Sunday,January 29,2017 - 02:15 by Z_CLU

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది టాప్ హీరోయిన్ నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దాస్ దర్శకత్వంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కింది. ‘డోర’ అనే టైటిల్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేయబోతున్నారు. మార్చి 3న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ… ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు ముస్తాబవుతున్నఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది….అన్నారు.