నయనతార కొత్త సినిమా ఆడియో రిలీజ్

Wednesday,March 08,2017 - 04:15 by Z_CLU

తమిళ, తెలుగులో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘డోర’. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకుడు. ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెరిన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే రిలీజ్ అయింది..

 

ఈ ఆడియో వేడుకకు ఎం.శంకర్, దశరథ్, జి.అశోక్ వంటి దర్శకులతో పాటు రచయిత చంద్ర బోస్ కూడా హాజరయ్యారు..ఈ సినిమాలో నయనతార క్యారెక్టర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని ఈ సందర్భoగా తెలిపారు మేకర్స్… ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ 31న తెలుగు, త‌మిళంలో భాషలో ఒకే సారి విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు దర్శకుడు దాస్…