ఏకంగా పధ్నాలుగేళ్ళు పట్టింది...

Tuesday,April 23,2019 - 04:05 by Z_CLU

రజినీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది నయనతార. ‘ఫస్ట్ సినిమాకే రజినీకాంత్ సినిమాలో చాన్స్ కొట్టేసింది ఎవరీ బొద్దుగా ఉన్న భామ’ అనుకున్నారంతా…. ఆ తరవాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు నయనతార. అంతగా సూపర్ స్టార్ ఇంపాక్ట్ పని చేసింది నయన్ సినిమా కరియర్ పై. కానీ  రజినీకాంత్ హీరోయిన్ అనిపించుకునే అవకాశమే మళ్ళీ నయనతారకి అంత ఈజీగా  రాలేదు.

ఎప్పుడో 2005 లో రిలీజయింది ‘చంద్రముఖి’ సినిమా. ఆ తరవాత మళ్ళీ రజినీకాంత్ సినిమాలో అవకాశం దక్కలేదు. అప్పుడెప్పుడో ‘కథానాయకుడు’ సినిమాలో నటించింది కానీ, కథాపరంగా ఆలోచిస్తే సినిమాలో రజినీకాంత్ సూపర్ స్టార్… ఆయన సినిమాలో నటించే హీరోయిన్ గా కనిపించింది నయన్. అంతేకానీ ‘కథానాయకుడు’ సినిమాలో హీరోయిన్ నయనతార కాదు.

అంతెందుకు ‘శివాజీ’ సినిమాలో కూడా కనిపించింది. కానీ జస్ట్ స్పెషల్ సాంగ్ వరకే అదృష్టం కలిసొచ్చింది. అప్పటి నుండి రజినీకాంత్, నయనతార జోడీపై ఫ్యాన్స్ లో డిమాండ్ క్రియేట్ అవుతున్నా, కథ…టైమ్ ఇలా ఏదో ఒకచోట మిస్ మ్యాచ్ అయి, ఈ కాంబినేషన్ తెరపైకి రాలేదు. ఇన్నాళ్ళకి ‘దర్బార్’ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో  రజినీకాంత్ సరసన కనిపించనుంది నయనతార. ‘చంద్రముఖి’ తరవాత మళ్ళీ రజినీకాంత్ హీరోయిన్ అనిపించుకోవడానికి 14 ఏళ్ళు పట్టింది నయనతారకి.