నయనతార వాసుకి రిలీజ్ డేట్

Tuesday,July 18,2017 - 02:03 by Z_CLU

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన ‘వాసుకి’ ఆగష్టు 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పుదియ నియమం’ తెలుగులో వాసుకిగా రిలీజవుతుంది. డ్రగ్స్, అత్యాచారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్ లోను ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

మాస్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ లో నయనతార పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద ఎసెట్ అంటున్నారి ఫిలిం మేకర్స్. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్, సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ‘వాసుకి’ తెలుగులోనూ అదే రేంజ్ లో సక్సెస్ అవుతుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.