రిలీజ్ కి రెడీ అవుతున్న నయనతార కర్తవ్యం

Thursday,October 12,2017 - 05:52 by Z_CLU

రీసెంట్ గా ‘వాసుకి’ సినిమాతో తనలోని డిఫెరెంట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసిన నయనతార ఇప్పుడు ‘కర్తవ్యం’ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో నయనతార డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కనిపించనుంది. అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

గోపీ నైనర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని R. రవీంద్రన్ నిర్మించాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.