బాలయ్య సినిమాలో నయనతార

Thursday,June 22,2017 - 12:08 by Z_CLU

నయనతార, బాలకృష్ణ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. K.S. రవికుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారు. ఇప్పటికే సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయగా.. ఈనెల 27వ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆగస్ట్ 1 నుంచి తమిళనాడులోని కుంభకోణంలో రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

గతంలో ‘సింహ’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాల్లో కలిసి నటించారు బాలయ్య-నయన్. తన ప్రతిష్టాత్మక వందో చిత్రంలో నయన్ నే హీరోయిన్ గా తీసుకోవాలని బాలకృష్ణ భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు 102వ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి మ్యూజిక్ ఇచ్చిన చిరాంతన్ భట్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.