మరో హారర్ థ్రిల్లర్ లో నయనతార

Tuesday,December 20,2016 - 07:30 by Z_CLU

రొమాంటిక్ లుక్స్ తో, హాట్ హాట్ పర్ఫామెన్స్ తో అలరించే నయనతార గతంలో  హారర్ థ్రిల్లర్ ‘మయూరి’ లోను 100 మార్కులు ఈజీగా కొట్టేసింది. అటు కమర్షియల్ సినిమాలతో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను కూడా ప్రిఫర్ చేస్తున్న నయనతార మరో హారర్ థ్రిల్లర్ ‘డోర’ తో భయపెట్టడానికి రెడీ అవుతుంది. దాస్ రామస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాని మాల్కాపురం శివకుమార్ నిర్మించాడు. ఈ సినిమా ఆడియోని జనవరిలో రిలీజ్ చేసి, ఫిబ్రవరికల్లా సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.