నయనతార డోర గ్రాండ్ రిలీజ్

Friday,March 31,2017 - 01:42 by Z_CLU

నయనతార డోర ఈ రోజే గ్రాండ్ గా రిలీజయింది. అటు తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ సినిమా అల్టిమేట్ హారర్ థ్రిల్లర్ లా తెరకెక్కింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి క్యారెక్టర్ లో నటించిన నయనతార లైఫ్ లో ‘డోర’ అనే ఒక కారు, ఆ కారులో ఉన్న ఆత్మ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది..? ఆ సమస్య నుండి ఎలా బయటపడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

నయనతార కరియర్ లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేయడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు కానీ, డోర మాత్రం డెఫ్ఫినేట్ గా సమ్ థింగ్ స్పెషల్ సినిమాలా నిలిచిపోతుంది. స్పెషల్ గా హారర్ సీక్వెన్సెస్ లో నయన్ పర్ఫామెన్స్, సినిమా చూసిన వారినెవ్వరినైనా తనతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తుంది.

దాస్ రామస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని హితేష్ ఝబాక్, A. సర్కుణం కలిసి నిర్మించారు. 141 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ లో తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ కీ రోల్స్ ప్లే చేశారు.