నయనతార 'కోకోకోకిల' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Saturday,October 06,2018 - 01:07 by Z_CLU

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ కోకోకోకిల. వరస విజయాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార ఈ సినిమాలో డిఫెరెంట్ రోల్ లో ఎంటర్ టైన్ చేసింది. ఈ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ వరల్డ్ ప్రీమియర్ జీ తలుగు తో పాటు జీ తెలుగు HD లో ప్రసారం కానుంది.

ఈ సినిమాలో డ్రగ్స్ సప్లై మిడిల్ క్లాస్ అమ్మాయిలా నయన్ పర్ఫామెన్స్ కి క్రిటిక్స్ నుండి కూడా అప్లాజ్ దక్కింది.  ఓ వైపు పోలీసులు, మరో వైపు మాఫియా నుండి తప్పించుకుంటూ కోకిల తన సమస్యల నుండి ఎలా బయటపడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమాలో హార్ట్ టచింగ్ ఇమోషనల్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. గ్రిప్పింగ్  స్క్రీన్‌ప్లేతో, అద్భుతంగా తెరకెక్కించిన కో కో కోకిల సినిమాను ఏమాత్రం మిస్‌ కాకుండా. ఈ అక్టోబర్‌ 7న సాయంత్రం 6 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానెల్స్‌ లో చూడండి.