పాజిటివ్ టాక్ దక్కించుకుంటున్న కోకోకోకిల

Friday,August 31,2018 - 01:17 by Z_CLU

నయనతార ‘కోకోకోకిల’ గ్రాండ్  గా రిలీజయింది. రీసెంట్ గా తమిళనాట రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా  ఈ రోజు తెలుగులో రిలీజయి ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది.

 అటు గ్లామరస్ హీరోయిన్ గా నటిస్తూనే, మరో వైపు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార, ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేస్తుంది.  తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్ సప్లయర్ గా మారే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఈ సినిమాలో నయనతార పర్ఫామెన్స్ కి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వస్తుంది.

నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు . లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.