నవాబ్ ట్రైలర్... మణిరత్నం మేజిక్ రిపీట్

Saturday,August 25,2018 - 12:50 by Z_CLU

మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే చాలు సినిమా లవర్స్ అందరూ ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.. దర్శకుల్ల్లో ఆయనకుండే క్రేజే వేరు. ప్రస్తుతం మణిరత్నం లేటెస్ట్ మూవీ ‘నవాబ్’ ట్రైలర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. నాగార్జున విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమా లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. భూపతి రెడ్డి అనే క్రిమినల్ కుటుంబానికి సంబంధించి యాక్షన్ & లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అరవింద స్వామీ, శింభు, విజయ్ సేతుపతి , అరుణ్ విజయ్, జ్యోతిక, అదితి రావు,ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

మణిరత్నం మేజికల్ సీన్స్ , సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, రెహ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ‘నవాబ్’ ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా మారింది. ఇక వరుస అపజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మణిరత్నం ఈ సినిమాతో తన మేజిక్ ను రిపీట్ చేసి మరో సూపర్ హిట్ ను  తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ అనిపిస్తుంది.

మద్రాస్ టాకీస్ & లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది.