నాని సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ అది కాదట...

Saturday,January 21,2017 - 09:06 by Z_CLU

టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘నేను లోకల్’ అంటూ థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాణం లో త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాని తో కలిసి హీరో నవీన్ చంద్ర కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఈ హీరో ఎలాంటి క్యారెక్టర్ చేసాడు? ఉన్నట్టుండి ఈ సినిమా కోసం లుక్ ఎందుకు చేంజ్ చేశాడనేది ప్రెజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆడియో వేడుకలో నవీన్ చంద్ర గురించి నాని మాట్లాడుతూ ‘ఒక పక్క హీరో గా చేస్తూనే నా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసాడు నవీన్ చంద్ర. ఖచ్చితంగా తన క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది’ అనడం తో ఈ హీరో ‘నేను లోకల్’ లో విలన్ గా కనిపించబోతున్నాడా? అనే డౌట్ కూడా అందరిలో మొదలైంది.

nani-naven-chandra
అయితే టీం మాత్రం అలాంటిదేం లేదని నవీన్ చంద్ర ఈ సినిమాలో సిద్దార్థ్ వర్మ అనే ఓ పాజిటివ్ రోల్ లో కనిపిస్తాడని ఆ క్యారెక్టర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ఈ హీరో స్పెషల్ రోల్ లో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో? తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే  ….