'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ లుక్ రెడీ

Saturday,July 13,2019 - 03:38 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ నేడు విడుదలైంది. ‘నేను గ్యాంగ్ లీడర్… మా గ్యాంగ్ రెడీగా ఉంది…’ అని నాని ప్రీ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సినిమా సబ్జెక్టు కి అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉంది.

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని జూలై 15 న విడుదల చేయనున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని జులై 18న, టీజర్ ని జులై 24న రిలీజ్ చేయనున్నారు. సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.