మరో సినిమాకి సంతకం చేసిన నాని

Tuesday,June 27,2017 - 11:29 by Z_CLU

నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాల స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ‘నిన్నుకోరి’ సినిమాకి ఇలా ప్యాకప్ చెప్పాడో లేదో  అప్పుడే MCA సినిమా కోసం రెడీ అవుతున్న న్యాచురల్ స్టార్ మరో సినిమాకి సంతకం చేసేశాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మరో డిఫెరెంట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా లాంచ్ డేట్ లాంటివి ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ, MCA సినిమాకి ప్యాకప్ చెప్పగానే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు నాని. ఈ సినిమాకి సంబంధించిన తక్కిన టెక్నీషియన్స్ తో పాటు, హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది.