‘జంబలకిడిపంబ’ టీజర్ ని రిలీజ్ చేసిన నాని

Friday,May 04,2018 - 01:29 by Z_CLU

న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజయింది ‘జంబలకిడి పంబ’ టీజర్. డిఫెరెంట్ కాన్సెప్ట్  తో అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాని, ఈ సినిమా గురించి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు.

“E.V.V. ‘జంబల‌కిడిపంబ‌’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. మళ్ళీ అదే టైటిల్ తో సినిమా అనగానే కష్టం కదా అనుకున్నా… కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . ఈ కాన్సెప్ట్ కి ఈ టైటిలే కరెక్ట్. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు. చాలా ఫన్ గా, సరదాగా ఉంటుంది.  టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది . `జంబల‌కిడిపంబ‌` బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…” అని చెప్పుకునాడు నాని.

 

J.B. మురళీ కృష్ణ డైరెక్షన్ లో  అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కింది ఈ సినిమా. 1: 20 నిమిషాల పాటు ఉన్న ఈ టీజర్ లో పెద్దగా హిలేరియస్ ఎలిమెంట్స్ ఎలివేట్ కాకపోయినా, ఈ టీజర్ లో రివీల్ అవుతున్న కాన్సెప్ట్ ని బట్టి సినిమాలో అదిరిపోయే కామెడీ  ఎలిమెంట్స్ ఉండటం ఖాయమనే అనిపిస్తుంది. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజి కంపోజర్.