అందరి ఫోకస్ నాని పైనే...

Friday,January 27,2017 - 04:13 by Z_CLU

ఈ ఇయర్ స్టార్టింగ్ మంత్ లో సీనియర్ హీరో లపైనే ఫోకస్ పెట్టిన టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు నేచురల్ స్టార్ నాని పై ఫోకస్ షిఫ్ట్ చేసారు. సంక్రాంతి కి మెగా స్టార్ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా తో పాటు శర్వా నంద్ ‘శతమానం భవతి’ సినిమా కూడా  థియేటర్స్ లో సందడి చేసి భారీ కలెక్షన్స్ వసూళ్లు కాస్త డీలా పడుతున్న టైం లో సంక్రాంతి సందడి ను ‘నేను లోకల్’ తో కంటిన్యూ చేస్తా అంటూ థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు నాని. ప్రెజెంట్ సంక్రాంతి సినిమాల తర్వాత మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది ఈ సినిమా.

nenu-local
ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుండగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను ఏ మాత్రం డిస్సపాయింట్ చెయ్యనంటున్నాడు నాని. ఈ ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేను లోకల్ ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చెయ్యడం ఖాయమని నాని కెరీర్ లో ఈ సినిమా మరో సూపర్ హిట్ గా నిలవడం ఖాయమంటున్నారు యూనిట్. మరి డైలాగ్స్, సాంగ్స్ తో ప్రెజెంట్ మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా సోషల్ మీడియా లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్ గ్రాఫ్ ను ఎలా పెంచుతుందో? చూడాలి…