న్యాచురల్ స్టార్ నాని MCA ఫస్ట్ లుక్

Wednesday,October 18,2017 - 05:21 by Z_CLU

దీపావళి సందర్భంగా నాని MCA ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సినిమా లాంచ్ అయినపుడే ఈ సినిమాలో హీరో మిడిల్ క్లాస్ అబ్బాయని ట్యాగ్ లైన్ తో క్లారిటీ ఇచ్చిన సినిమా యూనిట్, ఫస్ట్ లుక్ లోను ఆ పాయింట్ నే హైలెట్ చేసింది. చేతిలో రెండు మిల్క్ ప్యాకెట్ పట్టుకుని న్యాచురల్ స్టార్ ని మరింత న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తుంది MCA ఫస్ట్ లుక్.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. భూమిక కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. DSP మ్యూజిక్ కంపోజర్. డిసెంబర్ 21 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్.