నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ సత్తా

Friday,August 09,2019 - 05:13 by Z_CLU

జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా ఒకటి కనిపిస్తే అదే పెద్ద విషయం. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమాలు కూడా నేషనల్ అవార్డ్స్ కొల్లగొడుతున్నాయి. అలా ఈసారి జాతీయ అవార్డుల లిస్ట్ లో ఏకంగా 4 తెలుగు సినిమాలు మెరిశాయి.

అంతా ఊహించినట్టుగానే మహానటి సినిమా నేషనల్ అవార్డ్స్ లో మెరిసింది. ఏకంగా 3 అవార్డులు కొల్లగొట్టింది. ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకోవడంతో పాటు.. కీర్తిసురేష్ ఉత్తమ నటిగా నిలవగా.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు కూడా మహానటిని వరించింది. ఈ విభాగంలో ఇంద్రాక్షి పట్నాయక్, గౌరాంక్ష అవార్డు గెలుచుకున్నారు.

అవార్డుల్లో మహానటికి పోటీనిస్తుందనుకున్న రంగస్థలం కూడా మెరిసింది. ఈ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు దక్కింది. ఈ సినిమాకు రాజాకృష్ణ సౌండ్ మిక్సింగ్ చేశాడు.

 

 

మహానటి, రంగస్థలం సినిమాలతో పాటు ‘అ!’, చిలసౌ మూవీస్ కూడా ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లో మెరిశాయి. ‘అ!’ సినిమాకు బెస్ట్ మేకప్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు రాగా.. చిలసౌకు ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు దక్కింది.