టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'నర్తనశాల'

Sunday,July 08,2018 - 09:20 by Z_CLU

లేటెస్ట్ గా తన ఓన్ బ్యానర్ లో ‘ఛలో’ సినిమా తీసి హిట్ కొట్టిన నాగ శౌర్య.. మళ్ళీ తన బ్యానర్ లోనే ‘నర్తన శాల’ సినిమా చేస్తున్నాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కృష్ణ వంశీ దగ్గర పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 

ఇటివలే టాకీ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటుంది. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి  చేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన కష్మిరా పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర మహతి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.