ఒకేసారి థియేటర్లలోకి...

Wednesday,October 19,2016 - 09:00 by Z_CLU

 ఒక ఆత్మ, మరో దెయ్యం ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. రెండూ ఒకే జానర్ సినిమాలు. కానీ రెండూ వేటికవే భిన్నమైనవి. ఒకటి దెయ్యంతో కామెడీ పండించడానికి సిద్ధమౌతుంటే… ఇంకోటి ఆత్మతో భయపెట్టడానికి రెడీ అవుతోంది. నవంబర్ 11న ఆ రెండు సినిమాలు హల్ చల్ చేయబోతున్నాయి.

maxresdefault-2-1

నిఖిల్ హీరోగా నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, అల్లరి నరేష్ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ ఒకేసారి రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఆత్మకి మనిషికి మధ్య నడిచే థ్రిల్లర్ లవ్ స్టోరీగా నిఖిల్ సినిమా తెరకెక్కింది. కుమారి 21 F తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన హెబ్బా పటేల్ ఇందులో ఘోస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా థ్రిల్ చేయనుంది. ఈ సినిమాకి వి.ఐ. ఆనంద్ డైరెక్టర్.

still-1

ఇక అల్లరి నరేష్ సినిమాలో నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకుంది దెయ్యం. జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ హారర్ కామెడీతో మంచి హిట్ కొట్టాలని అల్లరోడు ఫిక్స్ అయిపోయాడు. అయితే ఇందులో దెయ్యం ఎవరు..? కామెడీ ఏ రూపంలో పండుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.