మూగవాడిలా కనిపించనున్న నారా రోహిత్

Wednesday,March 14,2018 - 01:20 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోలు విభిన్న పాత్రల్లో మెస్మరైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడిగా నటిస్తే, సుకుమార్ డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ‘రంగస్థలం’లో చెవిటి వాడిగా కనిపించనున్నాడు చెర్రీ. వీళ్లిద్దరితో పాటు ఇప్పుడు నారా రోహిత్ కూడా రెడీ అయిపోయాడు. తన నెక్స్ట్ సినిమాలో మూగవాడిలా కనిపించనున్నాడు.

P.B. మంజునాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నారా రోహిత్ మూగవాడిలా నటించనున్నాడు. ఉగాది రోజు ప్రారంభం కానున్న ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ గెటప్ లో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. డిఫెరెంట్ సినిమాలు చేసే ఈ హీరో కరియర్ లో, ఈ మూవీ స్పెషల్ గా నిలిచిపోతుందంటున్నారు  ఫిల్మ్ మేకర్స్.

 

వికాస్ కురిమెళ్ళ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి నారాయణ రావు అట్లూరి దర్శకుడు. శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్ల వివరాల్ని ఇంకా వెల్లడించలేదు.