మరో సినిమా స్టార్ట్ చేసిన నారా రోహిత్

Monday,January 29,2018 - 02:25 by Z_CLU

చకచకా సినిమాలు చేయడం నారా రోహిత్ స్టయిల్. కథ నచ్చితే సెట్స్ పైకి వెళ్లిపోవడమే. ఇప్పుడీ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎస్డీ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు.

వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలవుతుంది. ఈఎంవీఈ స్టుడియోస్ బ్యానర్ పై వడ్డేవల్లి సత్యనారాయణ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో నారా రోహిత్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా టిపికల్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. మరోవైపు వీరభోగ వసంతరాయులు అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న వెంకీ-తేజ సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టాడు.