నారా రోహిత్, జగపతి బాబు కాంబినేషన్ లో చిత్రం

Tuesday,October 10,2017 - 12:33 by Z_CLU

ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో మూవీ స్టార్ట్ చేయడం నారా రోహిత్ స్టయిల్. చేతిలో ఎప్పుడూ రెండు సినిమాలు ఉండాల్సిందే. తాజాగా కథలో రాజకుమారి సినిమాను రిలీజ్ చేసిన ఈ హీరో, ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. నారా రోహిత్ తో పాటు జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్న ఈ సినిమా రేపు ప్రారంభమౌతుంది.

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రేపు తెలుస్తాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీగా ఉన్నాడు జగపతిబాబు. కానీ ఈ సినిమాలో మాత్రం జగపతి బాబు చేస్తోంది క్యారెక్టర్ రోల్ కాదు. నారా రోహిత్ తో పాటు మరో హీరోగా నటించబోతున్నాడు. గతంలో ఆంధ్రుడు, అధినాయకుడు లాంటి సినిమాలు చేసిన పరుచూరి మురళి.. కాస్త గ్యాప్ తర్వాత ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్నాడు.

ప్రస్తుతం నారా రోహిత్ చేతిలో 3 సినిమాలున్నాయి. వీరభోగ వసంతరాయలు, పండగలా వచ్చాడు సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉండగా.. బాలకృష్ణుడు మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రాగానే.. పరుచూరి మురళి సినిమా సెట్స్ పైకి వస్తుంది.