అవును.. 21 కిలోలు తగ్గాను

Tuesday,November 21,2017 - 11:51 by Z_CLU

సినిమా కోసం బరువు తగ్గడం, పెరగడం కామన్. అయితే నారా రోహిత్ ప్రొఫైల్ లో మాత్రం ఇప్పటివరకు ఇలాంటి మార్పులు చూడలేదు. ఫస్ట్ టైం బాలకృష్ణుడు సినిమా కోసం ఇలాంటి ప్రయోగం ఒకటి చేశాడు నారా రోహిత్. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బాలకృష్ణుడు కోసం ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ ట్రై చేశానంటున్నాడు ఈ హీరో.

“ఈ సినిమాకు ముందే బరువు తగ్గే ప్రాసెస్ బిగిన్ చేశాను. ఇక ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాక పవన్ మల్లెల మరింత పుష్ చేశాడు. అలా ‘జ్యో అచ్యుతానంద’ కి ఈ సినిమాకి 21 కిలోల బరువు తగ్గాను.”

కాకపోతే బాలకృష్ణుడు సినిమాలో కంప్లీట్ సిక్స్ ప్యాక్ చూపించడం లేదంటున్నాడు నారా రోహిత్. ఇంకా తన సిక్స్ ప్యాక్ షేప్ రాలేదని, అందుకే ఉన్నంతలో మేనేజ్ చేశానని చెబుతున్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది బాలకృష్ణుడు సినిమా.