సెట్స్ పైకి వచ్చిన నారా రోహిత్ మూవీ ‘ఆటగాళ్ళు’

Wednesday,December 13,2017 - 12:20 by Z_CLU

నారా రోహిత్ ‘ఆటగాళ్ళు’ ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయింది. ‘గేమ్ విత్  లైఫ్’ అనే  ట్యాగ్ లైన్  తో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో జగపతి బాబు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాడు.  అక్టోబర్ 11 న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ, ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని ఈ రోజు నుండి సెట్స్ పైకి వచ్చేసింది.

కామెడీ  కింగ్  బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్  రోల్  ప్లే చేస్తున్న ఈ సినిమాని   ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వాసిరెడ్డి  రవీంద్ర, వాసిరెడ్డి  శివాజీ,  మక్కెన  రాము,  వడ్లపూడి  జితేంద్ర  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పరుచూరి మురళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.