భీముడి క్యారెక్టర్ లో నారా రోహిత్

Friday,September 01,2017 - 01:05 by Z_CLU

డిఫెరెంట్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు నారా రోహిత్. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘కథలో రాజకుమారి’ , ‘బాలకృష్ణుడు’ సినిమాలతో పాటు మరో సినిమాకి కూడా సంతకం చేసేశాడు.

ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫం అయితే చేయలేదు కానీ, గతంలో ‘సావిత్రి’ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘భీముడు’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకుందట సినిమా యూనిట్.

బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ లో ఎట్రాక్ట్ చేయనున్న నారా రోహిత్, ఈ సినిమాలో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేయనున్నాడని తెలుస్తుంది.