నారా రోహిత్ ఇంటర్వ్యూ

Tuesday,July 11,2017 - 07:10 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నారా రోహిత్ ‘శమంతకమణి’ అనే సినిమాతో రంజిత్ కుమార్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్నఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా నారా రోహిత్ మీడియా తో ముచ్చటించాడు. ఆ విశేషాలు నారా రోహిత్ మాటల్లోనే.

 

అది నిజంగా చాలా కష్టం

నలుగురు కలిసి ఓ సినిమా చేయడం అనేది ఈజీ కాదు చాలా కష్టం.  స్క్రిప్ట్ లో అందరికీ ఇంపార్టెన్స్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందరికీ ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటూ కథతో జర్నీ చేసే సినిమా ఇది. నిజంగా ఒక కొత్త అనుభూతి కలిగింది. చాలా మంచి జర్నీ.

ప్రతీ సారి ఓ కొత్త డైమెన్షన్

వరుసగా పోలీస్ క్యారెక్టర్స్  వస్తున్నాయి. ఇప్పటి వరకూ నాలుగు సార్లు పోలీస్ గా కనిపించాను. ఇక ఈసారి పోలీస్ గా చేయకూడదు అనే టైంకి సరిగ్గా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ తో ఉండే స్క్రిప్ట్స్ వస్తున్నాయి. కానీ ప్రతీ సారి రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త డైమెన్షన్ తో ఉండే పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందుకు మాత్రం హ్యాపీ గా ఫీలవుతున్నాను. ఈ సినిమాలో రంజిత్ కుమార్ అనే ఇంటెలిజెంట్  పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఎప్పుడు జోకులేస్తాడో.. ఎప్పుడు సీరియస్ అవుతాడో తెలియని క్యారెక్టర్ ఇది.  క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది.

ఈ క్యారెక్టర్ కాబట్టే చేశాను.

ఈ స్క్రిప్ట్ శ్రీరామ్ చెప్పగానే బాగా నచ్చింది. ముఖ్యంగా రంజిత్ కుమార్ క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. కొంచెం ఈజీగా చేసేయొచ్చనిపించింది. వేరే క్యారెక్టర్ అయితే చేసే వాడిని కాదేమొ కానీ ఈ క్యారెక్టర్ మీరే చేయాలనీ శ్రీరామ్ చెప్పగానే ఓకే అనేశాను. నిజానికి శ్రీరామ్ ఎవరికీ సూట్ అయ్యే క్యారెక్టర్ వాళ్లకి చెప్పాడు.


అప్పటి వరకూ నాకు కూడా తెలియదు

ఈ సినిమాలో నా రోల్ కి సంబంధించి అప్పట్లో ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు ఈ పేరుతో క్యారెక్టర్స్ చేసారని, ఇదో సెంటిమెంట్ అని అందరూ అంటున్నారు. నాకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యే వరకూ నిజంగా తెలియదు. ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అందరూ చెప్తుంటే హ్యాపీ గా ఫీలయ్యాను.

డైరెక్టర్ గా శ్రీరామ్ గ్రేట్ అనిపించింది

నిజానికి శ్రీరామ్ రెండో సినిమాను ఇంత మంది హీరోలతో 37 డేస్ లో షూట్ చేయడం జోక్ కాదు.  ఆ విషయంలో శ్రీరామ్ గ్రేట్. ఎప్పుడు స్మైల్ తో తనకి ఏం కావాలో అది రాబట్టుకుంటాడు. క్లియర్ క్లారిటీ తో తక్కువ టైంలో మంచి స్క్రిప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. శ్రీరామ్ త్వరలో పెద్ద డైరెక్టర్ అవుతాడు.

అంత టైం లేదు…

ఈ సినిమాలో నాకు హీరోయిన్ ఉండదు. నిజానికి అంత టైం కూడా ఉండదు ఓ కార్ దొంగతనం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ మీదే కథ వెళ్లిపోతుంటుంది. ఉండాల్సిన సినిమాలో ఉంటే చాలు. ఈ సినిమాకు ఈ క్యారెక్టర్ కి నిజంగా హీరోయిన్ అవసరం లేదు. సినిమాలో నా క్యారెక్టర్ సుధీర్ క్యారెక్టర్ కి ఇద్దరికీ హీరోయిన్స్ ఉండరు.

ఆ సినిమా కోసం తగ్గితే ఈ సినిమా వచ్చింది

పవన్ మల్లెల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను ఆ సినిమా కోసం బరువు తగ్గాల్సి వచ్చి కొంచెం తగ్గాను. అనుకోకుండా ఈ సినిమా వచ్చింది. సో ఆల్మోస్ట్ రెండు సినిమాలో ఒకేలా కనిపిస్తాను.


ఫస్ట్ లుక్ త్వరలోనే

ప్రెజెంట్ పవన్ మల్లెల డైరెక్షన్ లో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాను. అది నాకు ఓ కొత్త జోనర్. ఆ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి లో ఉంది. బర్త్ డే సందర్భంగా ఈ నెల 25 ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ కి రెడీ గా ఉంది.

కథలో రాజకుమారి షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేసేశాం. అందులో నేటివ్ షేడ్స్ ఉండే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. లవ్ స్టోరీ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పొచ్చు. త్వరలోనే  ఆ సినిమా రిలీజ్ ఉంటుంది.

నా నమ్మకం నిజమైంది.

‘బాణం’ చేసాక ‘ప్రతినిధి’ వచ్చింది ‘ప్రతినిధి’ తర్వాత ‘అసుర’ వచ్చింది ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండే వాడు’ వచ్చింది సో ఫస్ట్ కథ చెప్తే వింటాడు అనే నమ్మకం నా మీద వచ్చింది. కథని నమ్మి సినిమా చేయడం, అవి ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేయాడంతో నా నమ్మకం నిజమైంది. అందుకే ఫస్ట్ ఇంపార్టెన్స్ కథకే ఇస్తా.. ఇప్పటి వరకూ అన్ని సినిమాలు అలాగే చేస్తూ వచ్చాను. అలాంటి స్క్రిప్ట్స్ దొరకడం నిజంగా నా అదృష్టం.

క్రెడిట్ ఆడియన్స్ కె దక్కుతుంది.

మనం నటుడిగా ఎన్ని కొత్త క్యారెక్టర్స్ చేసినా… ఎంత కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేసినా చూసే వాళ్ళుండాలి ఆడియన్స్ ఆదరిస్తేనే మళ్ళీ మళ్ళీ అలాంటి కొత్త కథలు చేయగలం. నిజానికి ఆడియన్స్ మైండ్ బాగా మారింది. కొత్త కాన్సెప్ట్ తో వస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఆ విషయంలో క్రెడిట్ ఆడియన్స్ కె ఇవ్వాలి.