Pushpa Movie -  ఆ గాసిప్ నిజమేనా?

Monday,September 07,2020 - 08:00 by Z_CLU

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది పుష్ప సినిమా. కేరళలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. రెండో షెడ్యూల్ నాటికి కరోనా వచ్చింది. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలో మరో హీరోను తీసుకున్నట్టు తెలుస్తోంది.

అవును.. Pushpa Movie లో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలకమైన పోలీసాఫీసర్ పాత్ర ఉంది. ఆ పాత్రకు నారా రోహిత్ (Nara Rohit) అయితే సరిగ్గా సరిపోతాడని భావించి యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

నారా రోహిత్ ఇప్పటివరకు పోషించిన పోలీస్ పాత్రలన్నీ చాలా విలక్షణంగా ఉన్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెలో, శమంతకమణి లాంటి సినిమాల్లో రోహిత్ పోషించిన పోలీస్ పాత్రలకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే Pushpa సినిమాలో కూడా ఓ డిఫరెంట్ Police Character కు Nara Rohit ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో సాంగ్ పిక్చరైజేషన్ తో ఈ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.