18 Pages నవంబర్ 22న "నన్నయ్య రాసిన" సాంగ్

Friday,November 18,2022 - 04:44 by Z_CLU

“Nannaya Raasina” lyrical song from ’18Pages’ will be releasing on Nov 22nd

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “18 పేజిస్” (18 Pages).  నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) , అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameswaran) నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

“18 పేజిస్” చిత్రం నుండి విడుదలకాబోయే  సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ  చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు  నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18 పేజిస్” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రం ను డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాంటిక్ సినిమాకు పుష్ప దర్శకుడు సుకుమార్ కథ అందించాడు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics