'V' టీజర్ రివ్యూ

Monday,February 17,2020 - 06:25 by Z_CLU

నాని , సుదీర్ బాబుల  కాంబినేషన్ లో వస్తున్న ‘V’ టీజర్ రిలీజైంది. సుదీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాని ఓ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని టీజర్ లో క్లియర్ కట్ గా చూపించేశాడు దర్శకుడు.

ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంతే ” అంటూ సుదీర్ బాబు డైలాగ్ తో యాక్షన్ మోడ్ లో స్టార్టయిన టీజర్ చివర్లో వచ్చే ‘సోదాపు దమ్ముంటే నన్నాపు” అంటూ నాని డైలాగ్ తో ఎండయింది. ఇక టీజర్ లో పిజి.విందా విజువల్స్ , తమన్ బాగ్రౌండ్ స్కోర్ తో పాటు స్టంట్స్ , డైలాగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అయితే టీజర్ లో నివేత ఒకే ఒక్క సీన్ లో కనిపించగా అదితి రావు హైదరి పాత్రను సస్పెన్స్ గా పెట్టారు. అలాగే సినిమాలో నాని ఓ సీరియస్ కిల్లర్ అనే విషయాన్ని టీజర్ లో చూపించారు. నానిను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సుదీర్ బాబు కనిపించనున్నాడనేది అర్థమవుతుంది. ఇంతకీ నాని కిల్లర్ గా మారడానికి రీజన్ ఏంటి ? చివరికి రాక్షసుడు ని పట్టుకునేందుకు రక్షకుడు ఎలాంటి ప్రయత్నాలు చేసాడనేది మార్చ్ 25న తెలియనుంది.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు , శిరీష్ , హర్షిత్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు.