టక్ జగదీష్ లాంఛ్

Thursday,January 30,2020 - 12:02 by Z_CLU

సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ రిలీజ్ చేశారు. టైటిల్ తో పాటు మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అలా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన టక్ జగదీష్ మూవీ ఈరోజు స్టార్ట్ అయింది.  పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ ఈవెంట్ కు కొరటాల శివ స్పెషల్ గెస్ట్.

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోంది టక్ జగదీష్. ముహూర్తం షాట్ కు దిల్ రాజు క్లాప్ కొట్టగా, కొరటాల శివ బౌండెడ్ స్క్రిప్ట్ అందించారు. నిర్మాత నవీన్ కెమెరా స్విచాన్ చేశారు.

V సినిమా షూటింగ్ పూర్తిచేసిన నాని, ఇకపై తన ఫుల్ ఫోకస్ మొత్తం టక్ జగదీష్ పైనే పెట్టబోతున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి పొలాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లు.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందు ఇదే బ్యానర్ పై శివ నిర్వాణ డైరక్షన్ లో మజిలీ సినిమా వచ్చింది.