Tuck Jagadish - ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,December 19,2020 - 12:15 by Z_CLU

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ‘ట‌క్ జ‌గ‌దీష్’ (Tuck Jagadish) సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈ ఫిల్మ్‌లో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Nani న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

tuck_jagadish_nani

కాగా ‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫ‌స్ట్ లుక్‌ను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా హీరో నాని ప్ర‌క‌టించాడు..

నాని హీరోగా న‌టించిన హిట్ మూవీ ‘నిన్నుకోరి’తో ప‌రిచ‌య‌మై, రెండో సినిమా ‘మ‌జిలీ’తోనూ సూప‌ర్ హిట్ సాధించిన శివ నిర్వాణ (Shiva NIrvana) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వర్క్ చేస్తున్నాడు.

Also Check – టక్ జగదీశ్ ఫైనల్స్