

Friday,August 12,2016 - 05:09 by Z_CLU
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మరో సినిమాతో సిద్దమవుతున్నాడు. ఇటీవలే ‘జెంటిల్ మన్’ వచ్చి మంచి విజయం అందుకున్న నాని వరుస సినిమాలతో జోరు పెంచేసాడు. ప్రస్తుతం ‘ఉయ్యాల-జంపాల’ దర్శకుడు విరించి వర్మ తో ‘మజ్ను’గా రాబోతున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దిల్ రాజు నిర్మాణం లో ‘నేను లోకల్’ సినిమాను మొదలెట్టేసాడు న్యాచురల్ స్టార్. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నాడు నాని. ఇలా వరుస సినిమాలను సెట్స్ పై పెట్టేస్తూ దూసుకుపోతున్న నాని త్వరలోనే ఇంకో రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని ఫిలిం నగర్ టాక్.
Thursday,September 21,2023 04:19 by Z_CLU
Monday,April 03,2023 04:45 by Z_CLU
Friday,February 10,2023 01:02 by Z_CLU
Monday,January 16,2023 03:40 by Z_CLU