Shyam Singha Roy - రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,October 18,2021 - 04:32 by Z_CLU

Nani’s Shyam Singha Roy To Release On December 24

ప్రస్తుతం తెలుగులో నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో ఇలాంటి నేపథ్యంలో మొదటిసారిగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ విభిన్న  నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కథ మీదున్న నమ్మకంతో నిర్మాత వెంకట బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఖర్చులో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన ప్రతీ ఒక్కటి సమకూర్చారు. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతోంది.

శ్యామ్ సింఘరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. బెంగాలీ  కుర్రాడిలా కనిపించిన పోస్టర్, దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వాసు పోస్టర్ రెండూ కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. రెండు పాత్రలకు ఎక్కడా కూడా సంబంధం లేనట్టు కనిపిస్తోంది. పోస్టర్లతోనే సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.

Shyam Singha Roy

సినిమా మీదున్న బజ్‌ దృష్ట్యా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి, నానిలపై ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు. పీరియడ్ జోన్‌లో సాయి పల్లవి, నానిల మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉండోబోతోందని పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లకు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అది సినిమాకు ప్లస్ కానుంది. ఈగ చిత్రం అన్ని భాషల్లోకి డబ్ కావడంతో నాని కూడా ఇతర రాష్ట్రాల్లో సుపరిచితులే. ఇక తమిళ ప్రేక్షకులకు నాని అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే.

మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు  వీఎఫ్ఎక్స్ కోసం భారీ టీం పని చేస్తోంది.

Nani Shyam Singha Roy 2

నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాబోతోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.

రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Nani shyam singha roy

నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్
పీఆర్వో : వంశీ-శేఖర్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics