నాని "నిన్ను కోరి" టీజర్ లాంచ్

Friday,June 09,2017 - 10:38 by Z_CLU

నాని కొత్త సినిమా నిన్ను కోరి టీజర్ వచ్చింది. సాంగ్ రిలీజ్ లో భాగంగా కేవలం నాని, హీరోయిన్ నివేదా థామస్ మాత్రమే కనిపించాడు. టీజర్ లో మరో కీలక పాత్ర ఆది పినిశెట్టిని కూడా చూపించారు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో తీసిన సన్నివేశాలతో ఈ టీజర్ రిలీజైంది.

“ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాస్. అన్ని అలవాట్లు ఉన్నోడ్ని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేనోడ్ని పెళ్లి చేసుకుంటారు.” అనే డైలాగ్ తో టీజర్ విడుదల చేశారు. డైలాగ్ లో డెప్త్, నాని వాయిస్ మాడ్యులేషన్, ఇప్పటికే విడుదలైన సాంగ్ చూస్తుంటే ఇది కచ్చితంగా ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ అనే విషయం తెలుస్తోంది.

శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిన్ను కోరి సినిమా తెరకెక్కుతోంది. మూవీని జులై 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.