Tuesday,January 31,2023 - 03:24 by Z_CLU
ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi క్లాప్ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
మృణాల్ ఠాకూర్ నానికి జోడిగా నటించనుంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు.
Tuesday,April 23,2024 11:40 by Z_CLU
Tuesday,April 23,2024 10:50 by Z_CLU
Monday,April 22,2024 05:00 by Z_CLU
Saturday,April 20,2024 01:52 by Z_CLU