నాని "ఎంసీఏ" ఆడియో రిలీజ్

Monday,December 11,2017 - 11:25 by Z_CLU

నాని, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎంసీఏ. శ్రీరామ్ వేణు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా పాటల్ని ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ను చాలా రోజుల కిందటే విడుదల చేశారు. తాజాగా ఓ 3 రోజుల కింద మరో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలతో పాటు మిగిలిన 3 సాంగ్స్ ను జ్యూక్ బాక్స్ రూపంలో తీసుకొచ్చారు.

ఎంసీఏ సినిమాకు చంద్రబోస్, శ్రీమణి, బాలాజీ సాహిత్యం అందించారు. టైటిల్ సాంగ్ ను నకాష్ అజీజ్ ఆలపించగా.. మిగతా పాటల్ని సాగర్, కార్తీక్, దివ్యకుమార్, శ్రావణ భార్గవి ఆలపించారు. టైటిల్ సాంగ్ ఇప్పటికే హిట్.

ఎంసీఏ సినిమాలో భూమిక కీలకపాత్ర పోషించింది. నానికి వదినగా ఆమె కనిపించనుంది. రాజీవ్ కనకాల మరో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఎస్వీసీ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.